Sunday, August 19, 2018


ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత
ధనవంతుడుగా పేరు గాంచిన మన వడ్డి కాసుల
వాడి ఆలయానికి నిత్యం అవేలాది
భక్తులు వస్తుంటారు. పర్వ దినాలలో వారి
సంఖ్య లక్షలకు చేరుతుంది. ఈ స్వామి వారి
వార్షికాదాయం ఏడు వందల యాబై కోట్ల రూపాయల
పైమాటే. ఈ స్వామి వారికి మూడు వేల కిలోల
బంగారు డిపాజిట్లున్నాయి. ఇంకా వెయ్యి కోట్ల
రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లున్నాయి. ఈ ఆలయానికి
ఏటా సరాసరిన మూడు వందల కోట్ల రూపాయలు,
మూడు వందల కిలోల బంగారు ఆబరణాలు,
ఐదు వందల కిలోల వెండి ఆబరణాలు కానుకలుగా
వస్తుంటాయి. ఈ స్వామి వారికి జరిగే ఉదయాస్తమాన
సేవ టికెటు ధర పది లక్షల రూపాయలు. అయినా ఆ
టికెట్లు రాబోయె ముప్పై ఏళ్ళ వరకు బుక్ అయి
పోయాయి. మొత్తంమీద ఈ ఆలయం సంపద విలువ
ముప్పైమూడు వేల కోట్ల రూపాయలు. ఈ ఆలయం
వలన లక్షకు పైగా ప్రజలు ఉపాది
పొందుతున్నారు.
తిరుమల శ్రీనివాసుని ఆదాయం విషయానికొస్తే:....
ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా వంద
కోట్లు ఆ దాయం వస్తున్నది. బ్యాంకుల్లో
వుండే ఫిక్సుడు డిపాజిట్ల పై వడ్డీ 140
కోట్లు వుంటుంది. ఈ స్వామి వారి చెంత నున్న
బంగారం సుమారు ఐదు టన్నులు. విదేశాలలో
వున్న స్థిరాస్తుల విలువ సుమారు 33 వేల
కోట్లు.
ఈ ఆలయ పాలన అంతా 1952 వరకు మహంతులు,
మిరాసీ దారుల చేతుల్లో వుండేది. ఆ తర్వాత
తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి
చేతుల్లోకి వచ్చింది. తి.తి.దే ఏర్పడ్డాక కూడ
మిరాసి విధానమె కొనసాగింది. అనగా
పూజారులు వంశ పారంపర్య హక్కు కలిగి
వుండే వారు.
అర్చకులకు వేతనాలకు బదులు శ్రీవారి
ప్రసాదాల్లో వటా ఇచ్చేవారు. తయారు చేసిన ప్రతి
51 లడ్డులకు 11 లడ్డులను మిరాసి కింద
అర్చకులకిచ్చేవారు. వాటిని
అర్చకులు అమ్ముకునెవారు. 1987 లో అప్పటి
ముఖ్యమంత్రి ఎన్.టి.రామా రావు / మిరాసి విధానాన్ని
రద్దు చేశారు. కాని
అర్చకులు కోర్టు కెల్లారు. 1996 నాటి
కోర్టు తీర్పు తర్వాత తి.తి.దే మిరాసి పద్దతిని
పూర్తిగా రద్దు చేసింది.
అర్చకులకు వేతనం ఇచ్చే పద్దతిని
ప్రారంబించారు. కాని ఇప్పుడు మిరాసి విధానాన్ని
పునరుద్దరించాలని
అర్చకులు పోరాడుతున్నారు.
కారణం ఏమంటే?............ తి.తి.దే
ప్రస్తుతం రోజుకు 4 లక్షల
లడ్డులను తయారు చేస్తున్నది. మిరాసి
విధానం ప్రకారం ప్రతి 51 లడ్డులకు 11
లడ్డులను అర్చకులకివ్వాలి. అనగా
రోజుకు 86274 లడ్డులను అర్చకులకివ్వాలి.
ప్రస్తుతం ఒక లడ్డు ధర 25 రూపాయలు. ఆ
లెక్కన మిరాసి ధారులకు రోజుకు 21,56,000
రూపాయలను చెల్లించాలి. ఇంత ఆదాయాన్ని
వదులు కోడానికి వారికి రుచించ లేదు.
శ్రీవారు 2011 వ సంవత్సరంలో ఆదాయం: 1700
కోట్ల రూపాయలు ...... రాగా వివిద జాతీయ
బ్యాంకుల్లో వున్న డిపాజిట్లు కు వడ్డీ
ద్వార ......, వివిద రకాల పూజా కార్య క్రమాల
ద్వార రోజు వారి టికెట్ల విక్రయం ద్వారా మరో 200
కోట్ల రూపాయల ఆదాయం లబించింది. ఇవి గాత
భక్తులు సమర్పించిన వజ్రాలు, బంగారం,
వెండి, వంటి ఆభరణాలు సమర్పించారు. ఈ ఏడాది
అనగా 2012 లో 2.2 కోట్ల మంది భక్తులు స్వామి
వాని దర్శించు కున్నారు. [4]
తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు
వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి
తిరుమలలో శ్రీవారికి
రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి.
అవి: ప్రత్యూష, ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్ణ,
సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున
జరిగే సుప్రభాత సేవ ప్రత్యూషపూజలకు నాంది.
సుప్రభాతం: నిత్యం స్వామివారికి జరిపించే
ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున
మూడు గంటలకు సుప్రభాత సేవ
మొదలవుతుంది. అంతకు ముందే... ఆలయ
అర్చకులు, జియ్యంగార్లు, ఏకాంగులు,
శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన యాదవ
వంశీకుడు (సన్నిధిగొల్ల)
దేవాలయం వద్దకు వస్తారు. నగారా మండపంలో
గంట మోగుతుంది. మహాద్వారం గుండా సన్నిధి
గొల్ల ముందు వెళుతుండగా
అర్చకులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.
కుంచెకోలను,
తాళంచెవులను ధ్వజస్తంభం దగ్గరున్న
క్షేత్రపాలక శిలకు తాకించి
ఆలయద్వారాలు తెరిచేందుకు క్షేత్రపాలకుడి
అనుమతి తీసుకుంటారు. సుప్రభాతం చదివే
అధ్యాపకులు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి
వంశీకుడు తంబురా పట్టుకుని
మేలుకొలుపు పాడేందుకు సిద్ధంగా ఉంటారు.
బంగారువాకిలి తలుపులు తెరిచిన సన్నిధిగొల్ల
దివిటీతో ముందుగా లోపలికి వెళతాడు. వెంటనే
అర్చకులు కౌసల్యా సుప్రజారామ... అంటూ శ్రీ
వేంకటేశ్వర సుప్రభాతం పఠిస్తారు. ఆ తర్వాత
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం, ప్రపత్తి,
మంగళాశాసనం ఆలపిస్తారు. ఇదే సమయంలో
తాళ్లపాక వంశీకుడు తంబురా మీటుతూ,
గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీవారిని
మేల్కొలుపుతుంటాడు. అర్చక
స్వాములు అంతర్ద్వారం తలుపులు తెరిచి
గర్భగుడిలోకి వెళ్లి శ్రీవారి
పాదాలకు నమస్కరించి నిద్రిస్తున్న స్వామివారిని
మేల్కొలుపుతారు. పరిచారకులు స్వామివారి
ముందు తెరను వేస్తారు. ప్రధాన
అర్చకులు శ్రీవారికి నైవేద్యం పెట్టి, తాంబూలం
సమర్పించి నవనీత హారతి ఇస్తారు. మంగళాశాసన
పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి
స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి
భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ
సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని
విశ్వరూప దర్శనం అంటారు.
శుద్ధి: సుప్రభాత సేవ
అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి
మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ
శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత
రాత్రి జరిగిన అలంకరణలు,
పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి
ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.
అర్చన: శ్రీవారికి
ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది.
దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది)
నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న
వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి
సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష
సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి
ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు,
గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు.
చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి
విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు.
ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ
స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ
సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి
భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి
ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత
మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి,
అలంకారాసనం సమర్పిస్తారు.
అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి
నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని
దిద్దుతారు.